Thursday, August 6, 2009

ఆలోచనలు

మనము ఏమి ఆలోచిస్తే అదే మనకు జరుగుతుంది . మనము ఏది చేసినా మన ఆలోచనల ప్రకారం చేస్తాము, మనము చేసినదాని బట్టి దాని ఫలితము ఉంటుంది. మీకు షాపింగ్ కి వెళ్ళాలి అని ఒక ఆలోచన వచ్చి దానిని పాటించాలి అని అనుకుంటే , మీ శరీరం అదే ఫాలో అవుతుంది దాని ఫలితముగా మీరు షాపింగ్ కి వెళ్తారు. దీని అంతటికి మూలం ఆలోచన. కాని మనఆలోచనలని మనమే ఎంచుకొనే శక్తి మనకు ఉంది అని చాలా మందికి తెలియదు. మన మనస్సు అవే ఆలోచనలని మళ్లీ మళ్లీ ఆలోచించే బదులు, మనము కొంతసమయముని క్రొత్త ఆలోచనలు చేయటానికి కేటాయించవచ్చు . అలా మనము నియతిగా చేస్తే , మనము చేసే పనులుక్రొత్త దిశగా మార్చుకోవచ్చు తద్వారా క్రొత్త ఫలితాలని పొందవచ్చు.

ఆలోచనలు
విత్తనములు లాంటివి . మన జీవితములో క్రొత్త ఫలితాలు కావాలంటే , ఆలోచనలు ఫలితాలను పెంచుతాయో గుర్తించాలి. అవే ఆలోచనలని మన మనస్సు నిండా నింపుకోవాలి , ఆలోచనలు ఫలితాలని దూరము చేస్తాయో వాటిని వేరిపారెయ్యాలి. ఉదాహరణకి కారు డ్రైవింగు చేయాలని మీకు ఉంటే , ఆలోచనలు మంచి విత్తనములో ఏవి కావో నేను మీకు చెబుతాను.
  • ద్రైవింగ్ నేర్చుకోవటం చాలా రిస్కు తో కూడిన పని
  • ఏక్సిడెంటు అవ్వే చాన్సులు చాలా ఎక్కువ.
  • డ్రైవింగ్ క్లాసులకు చాలా దబ్బులు అవుతాయి
  • అంత ట్రాఫిక్ లొ నెను ద్రైవ్ చేయ గలుగుతానా
  • ఇప్పుడు ద్రైవింగ్ అంత అవసరము ఏమిటి
పైన ఆలోచనలు నిజం కాదు అని నేను అనటం లేదు. కాని డ్రైవింగ్ చెయ్యాలి అనే ఫలితాన్ని పొందటానికి కావలిసిన మంచి విత్తనాలు కావు. మరొక విధంగా చెప్పాలంటే డ్రైవింగ్ చెయ్యాలి అనే చెట్టు, పైన చెప్పిన ఆలోచనల మట్టిలో పెరగలేధు. కారు డ్రైవ్ చెయ్యకుంద ఉండటానికి అవి మంచి విత్తనాలు. అవి జీవితాంతం డ్రైవ్ చెయ్యకుండా వేరే వాళ్ళ మీద ఆధారపడటాన్ని పెంచుతుంది. ఒకవేళ మీకు అదే కావాలంటే మీ ఆలోచనల్లో ఎమీ తప్పు లేదు. కానీ ఇప్పుడు మీరు డ్రైవ్ చెయ్యకుండా , డ్రైవింగ్ నేర్చుకోవాలి అనే సంకల్పం తో ఉండి , మీ మనస్సు నిండా పైన చెప్పిన ఆలోచనలు ఉంటే మీలో లోపం ఉంది. మానసిక విత్తనాలు డ్రైవ్ చెయ్యాలి అన్న సంకల్ప వ్రుక్షాన్ని పెంచలేవు. ఆవే ఆలోచనలను పెంచుకొంటె మీరు జీవితములొ డ్రైవింగ్ చెయ్యలేరు ఎంధుకంటె టొమటొ విత్తనాలు వేసి పనసకాయను అశించలేము కదా.

ఆయితే విత్తనాలు డ్రైవింగ్ చెయ్యాలి అనే సంకల్పాన్ని పెంచటానికి ఉపకరిస్తాయొ చూద్దం.
  • నిజమే రిస్కు ఉంది. కాని నా మీద నాకు నమ్మకం ఉంది. ఎలాంటి కస్టాన్ని అయినా అదిగమిస్తాను.
  • డబ్బులు ఎంత అయినా ఒక్కసారి నేర్చుకుంటే జేవితాంతం ఉపయోగపడుటుంది.
  • ఎంతో మంది ఎంతో ట్రాఫిక్ లో డ్రైవింగ్ చేస్తున్నారు.
  • వేరే వాళ్ల మీద ఆదారపడటం కంటే నా స్వంతంగా డ్రైవింగ్ చెయ్యటం ఎంతోఅవసరం.
పైన చెప్పిన ఆలోచనలు డ్రైవింగ్ నేర్చుకొనుటకు సరైన విత్తనములు అయినప్పటికీ, మొక్క పెరగటానికి మంచి విత్తనాలు వేయటం సరిపోదు. ఎలాగైతే మొక్కలు పెరగటానికి చాలా నీళ్లు , సూర్యరశ్మి కావాలో అలాగే డ్రైవింగ్ నేర్చుకోవటానికి ఎంతో పరిశ్రమ అవసరం. కాని సరైన ఆలోచనలే మొదటి మెట్టు. డ్రైవింగ్ చేయటం ఒక ఉదాహరణ మాత్రమె . అది సిగిరెట్లు మానేయటమైన, బిజినెస్సు మొదలు పెట్టటమైన ఆలూచనే ముఖ్యం.

ముఖ్యముగా
నేను చెప్పేది ఏమిటంటే మీ జీవితంలో ఏదైనా మార్పులు చేయాలంటే మొదట మీ ఆలోచనలు మార్పు జరగటానికి కావలసిన మంచి విత్తనాలో కాదో చూడండి. మీరు అనుకొనే మార్పు మీకు జరగకపోతే దానికి ముఖ్యమైన కారణం మీ ఆలోచనలు సరైనవి కాకపొవటమే, వాటి బదులు కొత్త ఆలోచనలు నింపుకోవటానికి ప్రయత్నించాలి.

ఆలోచనలు మార్చుకోవటము అనేది మనకు తెలిసి కావాలని చేసే ఒక పని. మీలో మీరే సరే నేను డ్రైవింగ్ చెయ్యటంగురించి ఆలోచిస్తాను , చాలా బాగుంది తర్వాత ఏమిటి అంటే సరిపోదు. దానికోసం కొంత సమయమును కేటాయించిక్రొత్త మార్పు లేక పని చేయటానికి కావలిసిన మంచి ఆలోచనలు/విత్తనాలు ఏమిటో ఒక పేపర్ మీద వ్రాసి , వాటినే రోజూఆలోచిస్తూ పాత ఆలోచనల బదులు ఆలోచనలే ముఖ్యమైన అవ్వేట్లు సాధన చేస్తె క్రొత్త మార్పు/పని జరగటం చాలాసులబతరం అవుతుంది.

మొదట్లో పైన చెప్పిన సాధన చాలా కష్టంగా ఉంటుంది. క్రొత్త ఆలోచనలు ఆలోచిస్తుంటే మొదట్లో ఆలోచనలపైసందేహం వస్తుంది. డ్రైవింగ్ చెయ్యటం గురించి ఆలోచిస్తే మొదట్లో మీ ఊహలు అంత ఆహ్లాదకరంగా ఉండవు. మీరుచాలా ట్రాఫిక్ లో డ్రైవ్ చేస్తున్నట్లు మరియు ఎక్సిదేంట్లు కనపడతాయి. మరలా మీలో మీరే పాత ఆలోచనల లోకివెళుతున్నట్లు గమనిస్తారు . అది సర్వసాదారణం . కాని మీ ఊహల సహాయముతో సందేహమును అదిగమిన్చేట్లుసాధన చెయ్యాలి. మొదట్లో కష్టంగా ఉన్నా తర్వాత తర్వాత చాలా సులభం అవుతుంది. రెండు లేక మూడు వారాలలో క్రొత్త ఆలోచనలను మీరు నమ్మటం మొదలుపెడతారు. అప్పుడు పని చెయ్యాలనే ఉత్సాహం వస్తుంది. క్రొత్తఆలోచనలను మీరు నమ్మే స్టేజ్ కి రావటం ముఖ్యం. సహనన్తో సాధన చేస్తే మీ ఊహలే మిమ్మల్ని మీకుకావలిసిన గమ్యానికి చేరుస్తుంది.


గమనిక : మీకు ఆర్టికల్ మీద ఫీద్బెక్ ఇవ్వగలరు . లా ఆఫ్ ఎట్రాక్షన్ తెలిసిన వారికి చాలా నచ్చుతుంది.